నీటిని పొదుపు చేయాలి.. ఇంకుడు గుంతలు నిర్మించాలి!

ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి రూ.50 లక్షలతో 31వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం - కరీంనగర్‌ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ కరీంనగర్‌, అక్టోబర్‌ 24 (చైతన్యగళం): వాతావరణ మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కరీంనగర్‌ నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో...