హుస్నాబాద్‌ ‘స్టీల్‌ బ్యాంక్‌’ చొరవకు కేంద్ర మంత్రి ప్రశంసలు

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించే కార్యక్రమంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు భూపేందర్‌ యాదవ్‌ లేఖ హుస్నాబాద్‌, అక్టోబర్‌ 23 (చైతన్యగళం): గ్రామీణ ప్రాంతాల్లో శుభకార్యాలు, ఇతర సామూహిక వేడుకల్లో ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్‌ వస్తువుల వాడకాన్ని తగ్గించేందుకు హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ‘స్టీల్‌ బ్యాంక్‌’ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌ చొరవను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ అభినందించారు. ఈ మేరకు పొన్నం ప్రభాకర్‌కు లేఖ...