పేదల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఎస్.ఆర్. శంకరన్
మహబూబాబాద్ (చైతన్యగళం): బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, గిరిజనుల సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మానవతావాది విశ్రాంత ఐఏఎస్ అధికారి స్వర్గీయ ఎస్.ఆర్. శంకరన్ అని నలంద విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ డోలి సత్యనారాయణ అన్నారు. మహబూబాబాద్‌లోని నలంద డిగ్రీ కళాశాలలో సామాజిక అధ్యయన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, ప్రభుత్వ విశ్రాంత ఉపాధ్యాయుడు పార్నంది రామయ్య అధ్యక్షతన శంకరన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ డోలి సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి...