భూముల రీ సర్వేను వేగవంతం చేయాలి

క్షేత్రస్థాయి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: కలెక్టర్‌ చిత్రా మిశ్రా కరీంనగర్‌, అక్టోబర్‌ 23 (చైతన్యగళం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా వేగవంతం చేయాలని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు 10 గ్రామాల్లో ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మిగిలిన గ్రామాల్లోనూ ప్రణాళికాబద్ధంగా సర్వే పనులను పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న 30 రోవర్లను సమర్థంగా వినియోగించి...