NHM ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టాలి
11 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఫోరం సంపూర్ణ మద్దతు మహబూబాబాద్ (చైతన్యగళం): రాష్ట్రంలోని అర్హులైన జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ శాసనసభలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టాలని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఫోరం చైర్మన్ డాక్టర్ కుమార్ నాయక్ డుంగ్రోత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజారోగ్య సేవల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎన్‌హెచ్‌ఎం...