భూగర్భ జలాల పరిరక్షణకు ‘108 ఇంకుడు గుంతల’ లక్ష్యం
షర్టుపైనే పోస్టర్లు.. వీధివీధినా వినూత్న ప్రచారం.. జల సంరక్షణ కోసం జీవీఎల్ ముందడుగు! మహబూబాబాద్(చైతన్యగళం): ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటూ, భూగర్భ జలాల పరిరక్షణ ఆవశ్యకత పెరుగుతున్న నేపథ్యంలో నీటి సంరక్షణే లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లా శ్రీ వాసవి సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గర్రెపల్లి వెంకటేశ్వర్లు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వర్షపు నీటిని ఒడిసిపట్టుకొని భూగర్భ జలాలను పెంపొందించాలనే సంకల్పంతో 108 ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నడుం బిగించారు. సాధారణంగా...