మహబూబాబాద్‌లో వైభవంగా వాసవి అమ్మవారి శోభాయాత్ర
ఘనంగా ముగిసిన 25వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మహబూబాబాద్: పట్టణ కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 25వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై అమ్మవారిని ఊరేగిస్తూ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ్య సలహాదారు చౌడవరపు మోహన్‌రావు పర్యవేక్షణలో శోభాయాత్రను ప్రారంభించారు....