18 నెలల్లో పద్మనగర్‌ శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తి

టీటీడీ ఆధ్వర్యంలో పనులు.. నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కరీంనగర్‌, అక్టోబర్‌ 22 (చైతన్యగళం): కరీంనగర్‌ నగరంలోని పద్మనగర్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని 18 నెలల్లో పూర్తి చేయనున్నట్లు కాంట్రాక్టర్లు తెలిపారు. బుధవారం మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, ఇప్పటివరకు పూర్తయిన పనులు, తదుపరి చేపట్టాల్సిన పనుల వివరాలను కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసేలా పనులు...