CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 8:09 am Posted by : CHAITHANYA GALAM NEWS

పల్లె చెరువు అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి – మంత్రి పొన్నం ప్రభాకర్‌

హుస్నాబాద్‌, అక్టోబర్‌ 18 (చైతన్యగళం):

హుస్నాబాద్‌ పట్టణంలోని పల్లె చెరువు వద్ద సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పరిశీలించారు. పండుగకు వచ్చే మహిళలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా పల్లె చెరువు అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి, పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆకాంక్షించారు. పండుగ వేడుకలు సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.