నాగారంలో అంగరంగ వైభవంగా తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సంబరాలు
హుస్నాబాద్, అక్టోబర్ 18 (చైతన్యగళం): హుస్నాబాద్ మండలం నాగారం గ్రామంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ వేడుకలను మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చిన ఆడపడుచులు సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. బతుకమ్మ ఆటపాటలు, జానపద గీతాలతో గ్రామమంతా పండుగ శోభను సంతరించుకుంది. వేడుకల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు గ్రామ సర్పంచ్ ఇజ్జగిరి సంపత్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ...