బతుకమ్మ వేడుకలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలి
లోయర్ మానేరు డ్యామ్ నిమజ్జన కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం కరీంనగర్, అక్టోబర్ 18 (చైతన్యగళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ ఆదేశించారు. ఆదివారం నగరంలోని ప్రధాన బతుకమ్మ వేడుకల ప్రాంగణాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాలు, లోయర్ మానేరు...