మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్, అక్టోబర్ 18 (చైతన్యగళం): నగరంలోని రాంనగర్ మార్క్‌ఫెడ్ మైదానంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మహిళలతో బతుకమ్మ సంబురాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలతో మైదానంలో సందడి నెలకొంది. అనంతరం సప్తగిరి కాలనీ సమీపంలోని మానేరు నది వద్ద కుటుంబ సభ్యులతో కలిసి గంగుల కమలాకర్ బతుకమ్మలను నిమజ్జనం చేశారు. తెలంగాణ ఆడపడుచుల...