సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఆకట్టుకున్న పూల బతుకమ్మలు…
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో బతుకమ్మలకు బహుమతుల ప్రదానం. మహబూబాబాద్(చైతన్యగళం): జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా నిర్వహించిన వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ప్రదర్శించగా, వాటిలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన బతుకమ్మలకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. పూల పండుగైన బతుకమ్మ వేడుకలు సంప్రదాయాలు, సంస్కృతి, మహిళల ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి. ఈ పోటీల్లో పట్టణంలోని ప్రముఖ వ్యాపార సంస్థ ప్రకాష్ ఎలక్ట్రికల్స్...