మోత్కులపల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
వేడుకల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజు నాయక్ హుస్నాబాద్, అక్టోబర్ 18 (చైతన్యగళం): సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, ఆడపడుచులు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ భక్తిశ్రద్ధలతో సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామ ప్రజలంతా...