హుజూరాబాద్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రణవ్, మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని హుజూరాబాద్, అక్టోబర్ 18 (చైతన్యగళం): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రణవ్ బాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్‌రావు పాల్గొన్నారు. పట్టణంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో భాగస్వాములై పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పండుగ సందర్భంగా నిర్వహించిన...