CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 9:04 am Posted by : CHAITHANYA GALAM NEWS

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

  • హనుమాన్‌నగర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

కరీంనగర్‌, అక్టోబర్‌ 18 (చైతన్యగళం):

కరీంనగర్‌లోని హనుమాన్‌నగర్‌లో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సొసైటీ సభ్యులు, స్థానికులు కలిసి ఉత్సాహంగా పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.

బతుకమ్మ నిమజ్జనం అనంతరం సభ్యులంతా కలిసి అల్పాహారం స్వీకరించారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఐకమత్యంతో బతుకమ్మ వేడుకలను నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. బతుకమ్మ, దసరా పండుగల్లో పాల్గొన్న వారందరికీ సొసైటీ అధ్యక్షుడు భూపతిరెడ్డి, కార్యదర్శి సుధాకర్‌, ఇతర సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో 40వ డివిజన్‌ కార్పొరేటర్‌ నలువాల పుష్పలత రవీందర్‌ పాల్గొన్నారు.