ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
ఉద్యోగ భద్రత కల్పించి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి: డాక్టర్ కుమార్ నాయక్ డుంగ్రోత్ హైదరాబాద్, అక్టోబర్ 18 (చైతన్యగళం): తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో పనిచేస్తున్న సుమారు 17 వేల మంది ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఎన్హెచ్ఎం ఉద్యోగుల ఫోరం వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ కుమార్ నాయక్ డుంగ్రోత్ డిమాండ్ చేశారు. ఉద్యోగులకు భద్రత కల్పించడంతోపాటు, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజారోగ్య పరిరక్షణలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు కీలక పాత్ర...