పోగొట్టుకున్న హ్యాండ్‌బ్యాగ్‌ను బాధితురాలికి అప్పగించిన వన్‌టౌన్ పోలీసులు
కరీంనగర్, అక్టోబర్ 18 (చైతన్యగళం): షాపింగ్ కోసం తల్లితో కలిసి కరీంనగర్‌కు వచ్చిన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన పోలు సిరికొమల తన హ్యాండ్‌బ్యాగ్‌ను పోగొట్టుకున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో కరీంనగర్ వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ రాంచందర్‌రావు ఆదేశాల మేరకు ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు లుకుమార్ స్వామి, ఆకాష్ బ్యాగ్ కోసం గాలింపు చేపట్టారు. చివరకు బ్యాగ్‌ను గుర్తించి బాధితురాలికి అప్పగించారు. ఆ బ్యాగులో ఐదు గ్రాముల బంగారు చెవి కమ్మలు, రూ.1,500 నగదు ఉన్నట్లు వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ రాంచందర్‌రావు...