హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, అక్టోబర్ 17 (చైతన్యగళం): బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు వద్ద బతుకమ్మ వేడుకల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. చెరువు కట్టపై బతుకమ్మ ఘాట్‌ మెట్ల వద్దే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ చెరువు వైపు భద్రతా కంచెలు ఏర్పాటు చేయాలని, తగినంత వెలుతురు ఉండేలా దీపాల సదుపాయం కల్పించాలని సూచించారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించి, వాటి పురోగతిపై...