CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 4:23 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఏబీఎం పాలెంలో టీడీపీకి గట్టి దెబ్బ.. వైఎస్సార్‌సీపీలోకి 100 మంది చేరిక

నందికొట్కూరు, అక్టోబర్ 18 (చైతన్యగళం‌): నందికొట్కూరు పట్టణంలోని రెండో వార్డు ఏబీఎం పాలెంలో టీడీపీకి చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కాటేపోగు నాగ సురేష్‌, వైవీ రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, డాక్టర్‌ దారా సుధీర్‌ హాజరయ్యారు. వారి సమక్షంలో పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు కండువాలు కప్పి ఆహ్వానించారు. వార్డు అభివృద్ధికి, స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతనంగా పార్టీలో చేరిన నాయకులు పేర్కొన్నారు.