యాచారం, అక్టోబర్ 18 (చైతన్యగళం):
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నక్కర్త మేడిపల్లి గ్రామంలోని దుర్గామాత మండపం వద్ద ఆదివారం సాయంత్రం 7.02 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీటీసీ, యాచారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోటె శ్రీశైలం తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.