జమ్మికుంట ఆర్టీసీ బస్టాండ్‌లో కత్తులతో దాడి

ఆర్థిక లావాదేవీల వివాదంతో ఘర్షణ.. నలుగురికి గాయాలు కరీంనగర్, అక్టోబర్ 18 (చైతన్యగళం): కరీంనగర్‌ జిల్లాలోని జమ్మికుంట ఆర్టీసీ బస్టాండ్‌లో ఆర్థిక లావాదేవీల విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. రెండు వర్గాలకు చెందిన యువకుల మధ్య మాటామాటా పెరగడంతో పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో బస్టాండ్‌ పరిసరాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణలో నలుగురు యువకులు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులు, బస్సుల రాకపోకలతో రద్దీగా ఉండే...