హుస్నాబాద్‌కు కబడ్డీ అకాడమీ మంజూరు కావడం సంతోషకరం

జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్‌ హుస్నాబాద్, అక్టోబర్ 17 (చైతన్యగళం): హుస్నాబాద్‌ నియోజకవర్గానికి కబడ్డీ అకాడమీ మంజూరు కావడంతో స్థానిక క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కబడ్డీ అకాడమీ మంజూరైన సందర్భంగా హుస్నాబాద్‌ క్రీడా సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అకాడమీ మంజూరుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు క్రీడా...