పార్టీలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం

38వ డివిజన్‌లో రూ.24 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన - నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ కరీంనగర్‌, అక్టోబర్ 16 (చైతన్యగళం): పార్టీలకు అతీతంగా నగరంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేయడమే తమ పాలకవర్గం లక్ష్యమని కరీంనగర్‌ నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. ముఖ్యంగా విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం 38వ డివిజన్‌లో మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, ఉప మేయర్‌ యాదగిరి సునీల్‌రావుతో కలిసి పర్యటించారు....