ఎస్ఐ శ్రీకాంత్‌పై థర్డ్ డిగ్రీ ఆరోపణలు.. హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్
సిరిసిల్ల, అక్టోబర్ 17 (చైతన్యగళం): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్‌పై వచ్చిన థర్డ్ డిగ్రీ ఆరోపణల నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఎస్ఐ శ్రీకాంత్‌ను తక్షణమే ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. ఎస్ఐ శ్రీకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారంతో వరుస కథనాలు ప్రచురించారనే కారణంతో పోతురి...