దేవి శరన్నవరాత్రి మండపాలను సందర్శించిన పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి.. భద్రతా చర్యలు పాటించాలి నిర్వాహకులకు పోలీస్ కమిషనర్ సూచనలు కరీంనగర్, సెప్టెంబర్ 16 (చైతన్యగళం): దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్, నగరంలోని పలు అమ్మవారి పూజా మండపాలను సందర్శించారు. శుక్రవారం సాయంత్రం టౌన్ డివిజన్ పరిధిలోని గణేశ్నగర్, హనుమాన్నగర్ ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులతో మాట్లాడిన పోలీస్ కమిషనర్.. మండపాల వద్ద చేసిన ఏర్పాట్లు, భద్రతా చర్యల గురించి అడిగి...