CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 9:19 am Posted by : CHAITHANYA GALAM NEWS

దేవి శరన్నవరాత్రి మండపాలను సందర్శించిన పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం

  • ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి.. భద్రతా చర్యలు పాటించాలి
  • నిర్వాహకులకు పోలీస్‌ కమిషనర్‌ సూచనలు

కరీంనగర్‌, సెప్టెంబర్ 16 (చైతన్యగళం): దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం, ఐపీఎస్‌, నగరంలోని పలు అమ్మవారి పూజా మండపాలను సందర్శించారు. శుక్రవారం సాయంత్రం టౌన్‌ డివిజన్‌ పరిధిలోని గణేశ్‌నగర్‌, హనుమాన్‌నగర్‌ ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులతో మాట్లాడిన పోలీస్‌ కమిషనర్‌.. మండపాల వద్ద చేసిన ఏర్పాట్లు, భద్రతా చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ తరఫున పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో టౌన్‌ ఏసీపీ యాదగిరి స్వామి, ఇన్‌స్పెక్టర్లు రాంచందర్‌రావు, సృజన్‌రెడ్డి, తిరుమల్‌, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.