డంపుయార్డుపై రాజకీయ డ్రామాలు వద్దు

ప్రజా సమస్య పరిష్కారానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి.. రోజుకు 2 వేల మెట్రిక్‌ టన్నుల బయోమైనింగ్‌తో ఏడాదిలో చెత్త తొలగించవచ్చు: సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి కరీంనగర్, అక్టోబర్ 17 (చైతన్యగళం): కరీంనగర్‌ డంపుయార్డు సమస్యతో ప్రజలు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, సమస్యను పరిష్కరించకుండా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రాజకీయ లబ్ధి పొందాలని చూడటం సరికాదని సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని రాజకీయాలకు అతీతంగా అందరూ...