CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 1:28 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడమే నా ధ్యేయం

  • రూ.లక్షతో 8 నిఘా కెమెరాల ఏర్పాటు
  • ప్రజల భద్రతకు కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి: త్రీటౌన్‌ సీఐ తీర్మాల్‌ గౌడ్‌

కరీంనగర్, అక్టోబర్ 17 (చైతన్య గళం):

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే తమ ప్రధాన ధ్యేయమని కరీంనగర్‌ నగరపాలక సంస్థ 27వ డివిజన్‌ కార్పొరేటర్‌ బొట్ల శ్యామల–తంగెళ్ల కిరణ్‌కుమార్‌ (టిల్లు) తెలిపారు. డివిజన్‌లో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రూ.లక్ష వ్యయంతో ఏర్పాటు చేసిన ఎనిమిది నిఘా కెమెరాలను శుక్రవారం త్రీటౌన్‌ సీఐ తీర్మాల్‌ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో డివిజన్‌ ప్రజలకు భద్రతపై ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నిఘా కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. 27వ డివిజన్‌ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. స్థానిక ప్రజల సహకారంతో డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.

త్రీటౌన్‌ సీఐ తీర్మాల్‌ గౌడ్‌ మాట్లాడుతూ ప్రజల భద్రతకు పోలీసు వ్యవస్థ అత్యంత ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. నేరాల నియంత్రణకు, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడానికి, ప్రజలకు మరింత రక్షణ కల్పించడానికి నిఘా కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకొచ్చి కెమెరాలను ఏర్పాటు చేసిన కార్పొరేటర్‌ను అభినందించారు.

ఈ కార్యక్రమంలో 27వ డివిజన్‌ ప్రజలు, కాలనీ పెద్దలు, యువకులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.