పట్టభద్రుల పోరులో కమలం వ్యూహం: ఆలస్యమా? ఆచితూచి అడుగులా?
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కసరత్తు! కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రవర్ణ అభ్యర్థుల ప్రకటనతో మారిన సమీకరణాలు! తెలంగాణలో రాజుకుంటున్న బీసీ వాదం.. కమలనాథుల నజరు వెనుకబడిన వర్గాలపైనేనా? సంఘ్ నేపథ్యం, సేవాతత్పరత కలిగిన డాక్టర్ వన్నాల వెంకటరమణ వైపే మెజారిటీ శ్రేణుల మొగ్గు! హైదరాబాద్, అక్టోబరు 16(చైతన్యగళం): రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఉమ్మడి వరంగల్ - ఖమ్మం - నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల రణరంగం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు తమ...