పంటలు వేయొద్దనడం సిగ్గుచేటు!
ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రణాళిక ఏది? రైతులను భయపెట్టడం కాదు.. భరోసా కల్పించాలి - మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కరీంనగర్, అక్టోబర్ 16 (చైతన్యగళం): ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందంటూ రైతులను ఆందోళనకు గురిచేయడం కాకుండా, ఆ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికను వెల్లడించాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. యాసంగి పంటలు వేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు సూచించడం సిగ్గుచేటని విమర్శించారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు విందు ప్రాంగణంలో స్థానిక...