అనాథ వృద్ధులకు హరిహరపుత్ర సంస్థ చేయూత
స్పందన వృద్ధాశ్రమంలో చీరలు, లుంగీల పంపిణీ కరీంనగర్, అక్టోబర్ 16 (చైతన్యగళం): హరిహరపుత్ర సహాయక సేవా సంస్థ ఆధ్వర్యంలో దేశరాజుపల్లిలోని స్పందన అనాథ వృద్ధాశ్రమంలో మహిళలకు చీరలు, పురుషులకు లుంగీలు పంపిణీ చేశారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు 35 చీరలు, పురుషులకు 20 లుంగీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు చిన్ని రామకృష్ణ, అడ్డగుంట నరసయ్య, గుమ్మడి కుమారస్వామి, పైడ రవి, శ్రీ చిన్ని కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.