బొమ్మకల్లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
ఉయ్యాల పాటలకు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్రావు కరీంనగర్, అక్టోబర్ 16 (చైతన్యగళం): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని బొమ్మకల్లో ఏడు రోజుల సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా ముగిశాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలతో బొమ్మకల్ ప్రాంతం పండుగ శోభను సంతరించుకుంది. ఈ వేడుకలకు కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్థానిక మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో...