సద్దుల బతుకమ్మ, దుర్గామాత నిమజ్జనాలకు ఘనంగా ఏర్పాట్లు
రూ.3 కోట్లతో నగరవ్యాప్తంగా సౌకర్యాలు.. బతుకమ్మ పాయింట్లను పరిశీలించిన మేయర్ కొలగాని శ్రీనివాస్ కరీంనగర్, అక్టోబర్ 17 (చైతన్యగళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలతో పాటు దుర్గామాత విగ్రహాల నిమజ్జనాలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. మహిళలు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మేయర్ కొలగాని శ్రీనివాస్, ఉప మేయర్...