భక్తిభావంతో దేవీ నవరాత్రి మహా అన్నదానం
అన్నదానం మహాదానం.. సేవా కార్యక్రమాలు అభినందనీయం: అజయ్ సారధి రెడ్డి మహబూబాబాద్, అక్టోబర్ 17 (చైతన్యగళం): మహబూబాబాద్ పట్టణంలోని 33వ వార్డు పరిధిలో ఉన్న శ్రీరామ మందిరంలో రాజస్థాన్ మిత్రుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి సీపీఐ మున్సిపల్ పక్ష నాయకుడు, మానుకోట ప్రజా యుద్ధనౌక బి. అజయ్ సారధి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకలితో...