ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులు సహకరించాలి
సిద్దిపేట, అక్టోబర్ 16 (చైతన్యగళం): ప్రధాని మోదీ పిలుపుతో ప్రజలంతా ఏకమై కరోనా మహమ్మారిని ఎదుర్కొన్నట్లుగానే, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపుతో ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు, రైతులు ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కోరారు. శుక్రవారం దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని దుబ్బాక, భూంపల్లి-అక్బర్పేట, మీర్దొడ్డి, రాయపోల్, దౌల్తాబాద్, తొగుట మండలాలకు చెందిన 2,111 మంది రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు, 179 మంది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.1.79...