రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి
మానకొండూర్ ఏఎంసీ నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సూచన మానకొండూర్, అక్టోబర్ 17 (చైతన్యగళం): రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ మార్కెట్ కమిటీ సేవలను విస్తరించాలని కోరారు. శనివారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్లో మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ రేవెల్లి రాజలింగం, వైస్ చైర్మన్ రేమిడి శ్రీనివాస్ రెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు....