CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 12:45 pm Posted by : CHAITHANYA GALAM NEWS

రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి

  • మానకొండూర్ ఏఎంసీ నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సూచన

మానకొండూర్, అక్టోబర్ 17 (చైతన్యగళం):

రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ మార్కెట్‌ కమిటీ సేవలను విస్తరించాలని కోరారు.

శనివారం ఎల్‌ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో మానకొండూర్ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన చైర్మన్ రేవెల్లి రాజలింగం, వైస్‌ చైర్మన్ రేమిడి శ్రీనివాస్ రెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల రైతులకు మార్కెట్‌ కమిటీ సేవలు మరింత చేరువ కావాలని అన్నారు. రైతుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. పాలకవర్గ సభ్యులంతా సమన్వయంతో పనిచేస్తూ రైతుల అభ్యున్నతికి, మార్కెట్‌ కమిటీ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ సభ్యులు ఎర్రోళ్ల కవిత, తమ్మిశెట్టి రాజేష్, రామినేని రమణయ్య, కనకం అశోక్, రాపాక రాజేశ్వర్, కుంభం చిరంజీవి, కొత్తిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మందల సంపత్ రెడ్డి, ముక్కెర సతీష్ కుమార్, ఏ. రామాంజనేయులు, దూలం వీరస్వామి, విశ్వనాథుల వీరకుమార్, మానకొండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్లు నాగిశెట్టి రాజయ్య, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.