హుస్నాబాద్లో కబడ్డీ అకాడమీ ఏర్పాటు
40 మంది బాలబాలికలకు శిక్షణ, వసతి సదుపాయాలు హుస్నాబాద్,అక్టోబర్ 16(చైతన్యగళం): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ 2026 అక్టోబరు 15న జీవో నంబరు 1660 జారీ చేసింది. అకాడమీ ద్వారా 40 మంది క్రీడాకారులకు శిక్షణ, వసతి సదుపాయాలు కల్పించనున్నారు. అకాడమీలో 20 మంది బాలురు, 20 మంది బాలికలకు అవకాశం కల్పిస్తారు. వీరికి శిక్షణ అందించేందుకు బాలురు, బాలికలకు వేర్వేరుగా కోచ్లను నియమించనున్నారు. అదేవిధంగా వేర్వేరు...