కరీంనగర్ మహాశక్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు
మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి దివ్యదర్శనం.. అక్షరాభ్యాసాలు, పుస్తక పూజలతో సందడి కరీంనగర్, అక్టోబర్ 16 (చైతన్యగళం): దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. ఉత్సవాల్లో ఆరో రోజైన మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. చదువుల తల్లిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. విద్యార్థుల అక్షరాభ్యాసాలు, పుస్తక పూజలు, భవానీ దీక్షాధారుల రాకతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భవానీ దీక్షలో ఉన్న కేంద్ర హోంశాఖ...