చిగురుమామిడి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ

చిగురుమామిడి అక్టోబర్ 16(చైతన్యగళం): కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (ఐపీఎస్) చిగురుమామిడి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్ కాపీలు, పెండింగ్ కేసులు, రౌడీ షీటర్ల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణ, రిసెప్షన్ కౌంటర్, లాకప్ గదులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితుల సమస్యలను శ్రద్ధగా విని సత్వర న్యాయం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి...