CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 12:51 pm Posted by : rakeshkashaveni12@gmail.com

చిగురుమామిడి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ

చిగురుమామిడి అక్టోబర్ 16(చైతన్యగళం):

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (ఐపీఎస్) చిగురుమామిడి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్ కాపీలు, పెండింగ్ కేసులు, రౌడీ షీటర్ల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణ, రిసెప్షన్ కౌంటర్, లాకప్ గదులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితుల సమస్యలను శ్రద్ధగా విని సత్వర న్యాయం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి అలసత్వం వహించరాదని, గ్రామాల్లో నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

ఈ తనిఖీలో రూరల్ ఏసీపీ విజయకుమార్, తిమ్మాపూర్ సీఐ అనిల్, చిగురుమామిడి ఎస్సై జగదీశ్వర్‌తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.