ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన కలెక్టర్ చిత్రా మిశ్రా
ఐడీఓసీలో అంబరాన్నంటిన ఉద్యోగుల బతుకమ్మ సంబరాలు ఉద్యోగుల మధ్య ఐక్యత, ఆత్మీయతను పెంపొందించే వేడుకలు: కలెక్టర్ కరీంనగర్, అక్టోబర్ 16 (చైతన్యగళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కరీంనగర్లోని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో శుక్రవారం రాత్రి ఉద్యోగుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మహిళా అధికారులు, ఉద్యోగినులతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. తెలంగాణ జానపద గీతాలు, సన్నాయి, డోలు వాయిద్యాల నడుమ ఐడీఓసీ ప్రాంగణం పండుగ శోభను...