దుబాయ్లో వైభవంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యం: గోవర్ధన్ రెడ్డి కరీంనగర్, అక్టోబర్ 17 (చైతన్యగళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిమళాన్ని విదేశీ గడ్డపై చాటుతూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్ విల్లా నోవా సముదాయంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. ప్రముఖ వ్యాపారవేత్త గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో తెలంగాణ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి గౌరీదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి...