ఐడీఓసీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సిద్దిపేట, అక్టోబర్ 16 ( చైతన్యగళం): సిద్దిపేట జిల్లా ఐడీఓసీ కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందమైన పూలతో బతుకమ్మలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ సంప్రదాయాల ప్రకారం అమ్మవారిని ఆరాధిస్తారని, భక్తిశ్రద్ధలతో పూజించే వారిని భగవంతుడు తప్పక అనుగ్రహిస్తారని...