కరీంనగర్ నగరపాలక సంస్థలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
బతుకమ్మ పాటలకు అడుగులు వేసిన మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ దంపతులు పాటలు, నృత్యాలతో పండుగ శోభను సంతరించుకున్న నగరపాలక సంస్థ ప్రాంగణం కరీంనగర్, అక్టోబర్ 16 (చైతన్యగళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నగరపాలక సంస్థ మహిళా ఉద్యోగులు వివిధ రకాల రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలు, కోలాటాలు, సంప్రదాయ నృత్యాలతో నగరపాలక సంస్థ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. ఈ వేడుకలకు...