బతుకమ్మ వేడుకలకు నాగారంలో విద్యుత్ సదుపాయాల ఏర్పాటు

హుస్నాబాద్, అక్టోబర్ 16(చైతన్యగళం): హుస్నాబాద్: తెలంగాణ పూల పండుగ బతుకమ్మ వేడుకల సందర్భంగా హుస్నాబాద్ మండలం నాగారం గ్రామంలో సర్పంచ్ ఇజ్జగిరి సంపత్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా చేపడుతున్నారు. నాగారం గ్రామం నుంచి సమీపంలోని రాజీవ్ కుంట వరకు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. గత కొన్నేళ్లుగా బతుకమ్మ ఆడేందుకు రాజీవ్ కుంటకు వెళ్లే ఆడపడుచులు చీకటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతో పాటు త్వరలో విద్యుత్ దీపాలను కూడా బిగించనున్నట్లు సర్పంచ్ ఇజ్జగిరి...