వైభవంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారి దర్శనం.. ఘనంగా బిందెసేవ ఉత్సవాల్లో పాల్గొన్న ఆర్యవైశ్య మహాసభ నాయకులు, సీనియర్‌ సివిల్‌ జడ్జి శోభారాణి నందికొట్కూరు, అక్టోబర్‌ 16 (చైతన్యగళం‌): నందికొట్కూరులోని శ్రీ చక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు అమ్మవారిని చందనంతో మహాలక్ష్మి దేవిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తిని సరస్వతీ దేవిగా అలంకరించడంతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన బిందెసేవ కార్యక్రమంలో...