CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 7:43 pm Posted by : CHAITHANYA GALAM NEWS

వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శిల్పా చక్రపాణిరెడ్డి

బండి ఆత్మకూరు, అక్టోబర్‌ 16 (చైతన్యగళం‌):

బండి ఆత్మకూరు మండలం పరమటూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు ఖాసిం పీరా కుమారుని వివాహ వేడుకలో శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు.

వధూవరుల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వేడుకలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.