బొమ్మకల్‌లో సద్దుల బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు

రూ.2.80 కోట్లతో నగరవ్యాప్తంగా వేడుకలకు సదుపాయాలు కరీంనగర్, అక్టోబర్ 16 (చైతన్యగళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బొమ్మకల్‌లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం బొమ్మకల్‌ ప్రాంతంలో బతుకమ్మ ఆడే ప్రదేశాలు, చెరువు వద్ద నిమజ్జన ఘాట్‌లను డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. మహిళలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు బతుకమ్మ ఆడే ప్రదేశాలు, నిమజ్జన ఘాట్‌ల వద్ద చేపట్టిన ఏర్పాట్లను...